Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీ ఎంపీకి మాతృవియోగం

బీజేపీ ఎంపీకి మాతృవియోగం

- Advertisement -

నవతెలంగాణ- అమరావతి: అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం రమేశ్ తల్లి రత్నమ్మ హైదరాబాదులో ఆదివారం కన్నుమూశారు. రత్నమ్మ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప తరలించనున్నారు. రేపు సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో రత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం రమేశ్‌కు మాతృవియోగం కలగడంతో పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -