నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబిత సమగ్ర సవరణ సర్వే ప్రక్రియను విజయవంతంగా ముగించిన విషయం తెలిసిందే. ఇటీవల యూపీలో చేటట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితా నుంచి దాదాపు 2.89 కోట్ల మందిని తొలగించింది. ఈసీ నిర్ణయంపై సమాజ్ వాద్ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు.
ఉత్తరప్రదేశ్ లో నకిలీ ఓట్ల తయారీకి బీజేపీ సన్నాహాలు చేస్తుందని, అందుకే భారీ మొత్తంలో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని లక్నో మీడియా సమావేశంలో మండిపడ్డారు. ప్రజలంతా ఒక్కసారి ఓటర్ లిస్ట్‌లో తమ పేర్లు చెక్ చేసుకోవాలని సూచించారు. బీజేపీ ఫేక్ ఓట్లను సృష్టిస్తే..తమ పార్టీ శ్రేణులు చూస్తూ ఉండరని, బీజేపీపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేస్తామని హెచ్చరించారు. చాలా ఓట్లు కోత పెట్టబడినందున మొత్తం బీజేపీ నకిలీ ఓట్లను తయారు చేయాలనే లక్ష్యంతో ఉందని, ఓట్లను పెంచమని ముఖ్యమంత్రి స్వయంగా అధికారులను ఆదేశిస్తున్నారని ఆయన ఆరోపించారు.



