నవతెలంగాణ-హైదరాబాద్: ఎమర్జేన్సీపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ చేస్తుందని, ఆ పార్టీ పొలిటికల్ ఎజెండాలో భాగంగా అత్యవసర విధింపుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ ప్రభుత్వం లేఖలు పంపి..ఎమర్జేనీ విధంపుపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాజకీయ ఎజెండాను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని ఆయన మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్ సందర్భంగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండించారు. ఆ కాలాన్ని భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటిగా అభివర్ణించారు.