శ్లోక ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ రచన, దర్శకత్వంలో వెంకటేశ్వర రావు నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్ నైట్’. అక్షయ్, మదన్ కీలకపాత్రలు పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలోని సాంగ్స్, ట్రైలర్‌ను చిత్ర పరిశ్రమ పెద్దలు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ మధ్యకాలంలో దైవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ తరానికి తగ్గట్లు మరోసారి అటువంటి సినిమాలు తీస్తున్నారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఇటీవల కాలంలో ఇటువంటి దైవాత్మిక సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. చిత్ర సాంగ్స్, టైలర్ ఎంతో బాగున్నాయి’ అని ఆర్.కె.గౌడ్ చెప్పారు. సంగీత దర్శకుడు విజరు బొల్లా మాట్లాడుతూ, ‘ఓ ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందించాను. ఇటువంటి సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ సినిమాలో నాలుగు పాటలు రాసి అందించిన మా నిర్మాతకు ప్రత్యేక కతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్’ అని అన్నారు. ‘ఈ సినిమాకి నిర్మాత వెంకటేశ్వరరావు అడిగినంత బడ్జెట్ ఇచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ సహకారం మరువలేనిది’ అని దర్శకుడు సతీష్‌కుమార్ చెప్పారు.
మంచి పాయింట్‌తో ‘బ్లాక్ నైట్’
- Advertisement -
- Advertisement -