– మాటు వేసి.. మాట మాట పెరగగానే కత్తులతో వేటేసి….
– ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
– పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దారుణ ఘటన…
నవతెలంగాణ – సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో భార్యాభర్తల మధ్య వివాదం దారుణ రక్తపాతానికి దారితీసింది. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికంగా తీవ్ర కలకలం రేగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ప్రకారం, సుగ్లాంపల్లిలో భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించారు. అయితే, ఈ చర్చలు ఉద్రిక్తతకు దారితీసి, భార్య బంధువులపై భర్త బంధువులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్, ఓదెలకు చెందిన మోటం మల్లేష్ మృతి చెందారు. ఈ ఘటనలో మధునయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు, మరో వ్యక్తి కూడా గాయాలతో బాధపడుతున్నాడు. మధునయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘర్షణకు ఖచ్చితమైన కారణాలు, ఘటన జరిగిన విధానంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడి స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది.
భార్యాభర్తల పంచాయతీలో రక్తపాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES