బహిరంగ మార్కెట్లో గొర్రెలకు ఉచితంగా వేసే వ్యాక్సిన్లు
నాట్ ఫర్ సేల్’ అని ఉన్నా పట్టించుకోని వెటర్నరీ సిబ్బంది
ఏపీ నుంచి తెలంగాణకు అక్రమ రవాణా
ఒక బాటిల్ ధర రూ. 600
ఇరు రాష్ట్రాల అధికారులకు జీఎంపీఎస్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బ్లూ టంగ్ వ్యాక్సిన్ రాకెట్ (నీలి నాలుక మందు) వెలుగు చూసింది. గొర్రెలు, మేకలకు రోగాలు రాకుండా ముందస్తుగా ఈ వ్యాక్సిన్ వేస్తారు. ఉచితంగా అందాల్సిన వ్యాక్సిన్ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో దర్శనమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థల వద్ద కొని అక్కడ ఉచితంగా పంపిణీ చేస్తున్నది. దాన్ని ఏపీ నుంచి రహస్యంగా తీసుకొచ్చి తెలంగాణలో ఒక బాటిల్‌కు రూ. 600 చొప్పున అమ్ముతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇది వెలుగులోకి వచ్చింది. బాటిల్‌పై ‘నాట్ ఫర్ సేల్’ అనే షరతు ఉన్నా…దాన్ని కూడా పశుసంవర్థక శాఖ సిబ్బంది లెక్క చేయడం లేదు. ప్రయివేటు వ్యక్తులకైతే అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్కడ ఉచితంగా పంపిణీ చేసినట్టు లెక్కలు చూపించాలంటే, బాటిల్‌ను కూడా జాగ్రత్తగా ఏపీకి అప్పజెప్పాలి. అందుకు అంగీకరించిన కొంత మంది అధికారులు ఈ రాకెట్‌లో పాలు పంచుకుంటున్నారు. ఇండియన్ ఇమ్యూనో లాజికల్స్ లిమిటెడ్ నుంచి ‘రక్షాబ్లూ వ్యాక్సిన్’ ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్లను ఏపీ పశుసంవర్థకశాఖ అధికారులు… కొందరు వ్యక్తులతో కలిసి తెలంగాణలోని ప్రయివేటు వెటర్నరీ మెడికల్ షాపుల ద్వారా అక్రమంగా కాపరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండల కేంద్రం, శిల్పకుంట్ల గ్రామం, అర్వపల్లి మండల కేంద్రంలో బ్లూ టంగ్ వ్యాక్సిన్ నేక్టివేటెడ్ ఐపీ రక్ష-బ్లూ విక్రయాలు జోరుగా సాగుతు న్నాయని గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన గొర్రెల కాపర్ల సంఘాలు, వ్యాక్సిన్ బాటిళ్ల బ్యాచ్ నంబర్లను పరిశీలించగా, ఇవి తెలంగాణకు చెందినవి కావని నిర్ధారించాయి. ఈ అక్రమ రవాణా వెనుక ఏపీ, తెలంగాణాలోని పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రయివేటు వ్యక్తులు కుమ్మక్కైనట్లు గొర్రెల కాపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్లను అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో ఔషధ నియంత్రణ శాఖ కూడా చోద్యం చూస్తున్నది. ఈ అక్రమాలను అరికట్టాల్సిన పశు సంవర్థక, ఔషధ నియంత్రణ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నా యని ఆరోపణలున్నాయి. జిల్లా అది óకారులకు ఈ విషయం తెలిసినా, ఉన్నతాది óకారులకు చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు పశుసంవర్థక శాఖ 2023లో బ్లూ టంగ్ వ్యాక్సిన్ కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేసింది. ఆ తర్వాత కాలంలో ఆ విషయాన్ని పట్టిం చుకోలేదు. దీంతో గొర్రెల కాపర్లు వ్యాక్సిన్లను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. రాష్ట్రంలో ప్రతి ఐదువేల పశువులకు ఒక డాక్టర్ ఉండాలి. కానీ 17000 పశువులకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. దీంతో పశువుల ఆరోగ్యానికి రక్షణ లేకుండాపోయింది. 2019 లెక్కలు 2.49 కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నట్టు చెబుతున్నాయి. వీటికి రోగాలు సోకితే అంతే సంగతులు. అందుకే ప్రభుత్వాలు బీమా సౌకర్యం కల్పించడం, ముం దస్తుగా ఈటీ, పీపీఆర్, హెచ్‌ఎస్, షీపాక్స్ వంటి వ్యాక్సిన్లు, మందులు వేయాలి. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అవేవీ అమలు కావడం లేదు.
గొర్రెల కాపర్లకు ఉచిత వ్యాక్సిన్ సౌకర్యం కల్పించాలి
జీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్
గొర్రెలు, మేకలకు ఉచిత వ్యాక్సిన్ సౌకర్యం కల్పించాలి. ఔషధ నియంత్రణ శాఖ అక్రమ రవాణాను అరికట్టాలి. ఈ కుంభకోణంపై రెండు రాష్ట్రాల పశుసంవర్థక, ఔషధ నియంత్రణ శాఖలు దర్యాప్తు చేపట్టాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రయివేటు వ్యక్తులపై నిఘా పెట్టాలి. ఏపీ నుంచి వస్తున్న వ్యాక్సిన్లను నియంత్రించాలి. వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో గొర్రెల కాపర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నీలినాలుక, నట్టల మందులు ఉచితంగా వేయించాలి.
‘బ్లూ టంగ్’ రాకెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES