Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంతాళం వేసిన ఇంట్లో చిన్నారుల మృతదేహాలు..

తాళం వేసిన ఇంట్లో చిన్నారుల మృతదేహాలు..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన విషాద ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజులుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోని మంచంపై ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మైలవరానికి చెందిన వేములమడ రవిశంకర్, చంద్రిక దంపతులకు లక్ష్మీ హిరణ్య (9), లీలాసాయి (7) అనే ఇద్దరు పిల్లలున్నారు. దాదాపు రెండు నెలల క్రితం చంద్రిక తన భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలు తండ్రి రవిశంకర్ వద్దే ఉంటున్నారు. గురువారం ఉదయం రవిశంకర్ తండ్రి లక్ష్మీపతి ఇంటికి వచ్చి చూడగా, లోపలి నుంచి తాళం వేసి ఉంది. గది నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా, మనవడు, మనవరాలు మంచంపై ఎలాంటి కదలిక లేకుండా పడి ఉండటం గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా, లక్ష్మీ హిరణ్య, లీలాసాయి అప్పటికే మరణించి ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిన్నారుల మృతదేహాలను పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad