Sunday, May 4, 2025
Homeజిల్లాలుదుబ్బగూడెం(తాళ్ళగుంపు) గ్రామంలో నాలుగు రోజులు ఘనంగా బొడ్రాయి వేడుకలు.. 

దుబ్బగూడెం(తాళ్ళగుంపు) గ్రామంలో నాలుగు రోజులు ఘనంగా బొడ్రాయి వేడుకలు.. 

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం, సరిహద్దు గంగారం మండలంలోని దుబ్బగూడెంలోని తాళ్ళగుంపు లో బొడ్రాయి వేడుకలు గత గురువారం 1వ తారీఖు నుండి ఆదివారం వరకు నాలుగు రోజులు ఘనంగా నిర్వహించారు. నాలుగో రోజు ముగింపు ఆదివారం నాడు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మొదటి రోజు గురువారం యాగశాల అలంకరణ, నాలుగు దిక్కుల తోరణాలు నిర్మాణం. జ్యోతి ప్రజ్వలన, విగ్నేశ్వర పుణ్యాహవాచనం ప్రసాదాలు కర్పూర హారతి కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు శుక్రవారం సుప్రభాత సేవ, నిత్య పూజ కార్యక్రమాలు, నిత్య అగ్ని హోమాలు, క్షీరాదివాసం, జలాదిస్నానాలు, మంగళ హారతి ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నేడు 4న ఆదివారం హోమాలు, వసంతోత్సవం అష్టదిగ్బంధనం, ఊరడి (బలి పూజా) బోనాలు కార్యక్రమాలు నిర్వహించారు. 
గ్రామ ఆడపడుచులకు అమ్మవారి బోనాలు సమర్పించుట నైవేద్యం ముడుపులు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అష్టదిగ్బంధనం బలి తిరుగుట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వారు బయటకు పోకూడదు బయటివారు లోనికి రాకూడదు అని తెలిపారు. బొడ్రాయి ఉదయమే పేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ బొడ్రాయిని ప్రతిష్టించారు. గ్రామ పెద్దల సమక్షంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ‌ అగ్ని ప్రతిష్టాపన, హోమం, బొడ్రాయి ఊరేగింపు అభిషేకం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతి తో ఊరేగింపుగా వెళ్లి గ్రామంలో ప్రతిష్టించిన బొడ్రాయి దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ పోలేబోయిన సమ్మయ్య, గ్రామ పెద్దలు వడ్లకొండ శ్రీను, అయిలు రవిందర్, ఊకే ఎర్రయ్య, డాక్టర్ అయిలు రామలింగయ్య, కల్తీ జగ్గారావు, యూత్ నాయకులు పూనెం సందీప్ , గడ్డం శివ, అయిలి అశోక్, మహిళా నాయకులు, వార్డు సభ్యులు పోలిబోయిన నర్సక్క, ఐలు పద్మ, మహిళలు గ్రామస్తులు మేధావులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -