Tuesday, April 29, 2025
Navatelangana
Homeక్రైమ్ఖమ్మంలో ఉపాధి పనుల ప్రదేశంలో మృతదేహం అవశేషాలు

ఖమ్మంలో ఉపాధి పనుల ప్రదేశంలో మృతదేహం అవశేషాలు

- Advertisement -

కొండల్లో, గుట్టల్లో ఉపాధి పనులా..? :వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్‌
నవతెలంగాణ-సత్తుపల్లిరూరల్‌: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామ సమీపంలోని ఫారెస్టు భూమిలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మృతదేహం అవశేషా లు, బట్టలు బయటపడ్డాయి. దాంతో వారు వెంటనే స్థానిక నాయకులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు సమాచారం అందిం చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గురు తెలియని మహిళ మృతదేహాన్ని పాతిపెట్టి నట్టు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. కాగా, ఈ ఘటనపై వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గతంలో ఉపాధిహామీ పనులను చెరువుల్లోనూ, పంట కాల్వల్లోనూ పనులు చూపించే వారన్నారు. ఇప్పుడు అటవీప్రాంతం, కొండలు, గుట్టలు, శవాల దిబ్బల ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు చూపిస్తున్నారని తెలిపారు. దాంతో కూలీలు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రస్తుతం శవాలు కూడా పని ప్రదేశాల్లో బయటపడుతున్నాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు