- Advertisement -
నవతెలంగాణ-బోధన్
నిజామాబాద్ జిల్లా సాలూర మండల సమీపంలో మంజీర నదిపై గల పాత వంతెనకు శనివారం ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అటువైపు వెళ్లిన స్థానికులు చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. అయితే, మృతుడు మహారాష్ట్ర కార్లా గ్రామానికి చెందిన మరీబా(65)గా అక్కడకు వచ్చిన వారు గుర్తించారు. మృతుడు బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి రాలేదని పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదని వారు తెలిపారు. ఈ విషయమై బోధన్ రూరల్ పోలీసులను వివరణ కోరగా.. అది మహారాష్ట్ర పోలీసుల పరిధిలో ఉందని తెలిపారు.
- Advertisement -