నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీఆర్‌ఎఫ్ బృందాలు మేడిపల్లి ప్రతాప్ సింగారం మూసీ వద్దకు చేరుకున్నాయి. ఆదివారం చీకటి పడే వరకు స్వాతి శరీర భాగాల కోసం పోలీసులు, డీఆర్ బృందాలు ఇక్కడ గాలించాయి. సోమవారం మరోసారి బోట్లతో గాలిస్తున్నారు. మూసీలో ప్రవాహం ఎక్కువ ఉండటంతో శరీర భాగాలు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం 10 కిలోమీటర్ల దూరం వరకు డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించాయి.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో గర్భవతైన తన భార్యను చంపిన మహేందర్.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం శరీరభాగాలను కవర్‌లో ప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి పడేశాడు. విచారణలో స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి మూసీలో వేసినట్లు మహేందర్‌రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మూసీ నదిలో గర్భిణి శరీర భాగాలు..డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES