Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఫ్యాక్టరీలో పేలిన‌ బాయిల‌ర్..15మంది మృతి

ఫ్యాక్టరీలో పేలిన‌ బాయిల‌ర్..15మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్ పేలుళ్లు క‌ల‌క‌లం రేపాయి. ఫైసలాబాద్‌లో ఓ గ్లూ(గమ్‌) తయారుచేసే ఫ్యాక్టరీలో బాయిల‌ర్ పేలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో దాదాపు 15మంది మృతి చెందాగా..ప‌లువురికి తీవ్ర‌గాయాలైయ్యాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనంతో పాటు చుట్టుపక్కల ఇల్లు కూడా దెబ్బతిన్నాయి.అయితే పేలుడుకు గల కారణాలేంటనేది తెలియరాలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన అనంతరం ఫ్యాక్టరీ యజమాని పరారవగా.. మేనేజర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -