Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంతీహార్ జైలుకు బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్

తీహార్ జైలుకు బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ గురువారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఈ నెల 2న సరెండర్ కావాలని ఆదేశించగా.. గడువు పెంచాలంటూ రాజ్ పాల్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. వెంటనే లొంగిపోవాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
తమ సంస్థ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు రాజ్ పాల్ యాదవ్, ఆయన భార్య ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ మురళీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 2018లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. రాజ్ పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. రాజ్ పాల్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై నటుడు అప్పీల్ చేసుకోగా 2019లో సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ రాజ్‌పాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -