- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బెదిరింపులకు పాల్పడింది న్యూయార్క్‌కి చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -



