- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్‌ను పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేయడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో మూడు గంటల పాటు ఇంటెన్సివ్ తనిఖీలు చేపట్టారు. చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అయితే, కాల్ చేసిన వ్యక్తుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -