- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. చెన్నై ఆళ్వార్పేట్ లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు త్రిష ఇంటికి చేరుకొని తనిఖీలు చేపట్టగా, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. త్రిష ఇంటికి ఇలా బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



