Saturday, October 4, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం

ఢిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బాంబు బెదిరింపు మెయిల్స్ ఢిల్లీని గత రెండు రోజులుగా కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టుకు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ చేసిన విష‌యం తెలిసిందే.తాజాగా అదే తరహా మెయిల్‌ వచ్చింది. ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేయగా ఎలాంటి బాంబు దొరకలేదు. దాంతో అది కూడా ఆకతాయి మెయిలేనని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -