- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది, బేగంపేట పోలీసులు.. విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఓ గుర్తు తెలియని దుండగుడి ఫోన్‌కాల్‌తో బేగంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు.
- Advertisement -