Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు

సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే.. గుర్తుతెలియని వ్యక్తి కోర్టుకు ఫోన్ చేసి, ఆవరణలో బాంబు అమర్చినట్లు హెచ్చరించాడు. ఈ సమాచారం అందుకున్న కోర్టు సిబ్బంది తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కోర్టుకు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, లోపల ఉన్నవారందరినీ బయటకు పంపించివేశారు. అనంతరం బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad