- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ విజయేందర్ గుప్తా (Speaker Vijayender Gupta)కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అయితే, ఆ ఈ-మెయిల్లో అసెంబ్లీ ప్రాంగణాన్ని పేల్చివేస్తామని సందేశం ఉంది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ తరహా బాంబు బెదరింపు మెయిల్ రావడంతో ఆందోళన కలిగిస్తోంది.ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
- Advertisement -


