నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సదురు మెయిల్ వచ్చనట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. కోర్టు సిబ్బంది కార్యాలయాలే లక్ష్యంగా పలు చోట్ల బాంబులు పెట్టినట్లు ఆ మెయిల్ లో పేర్కొన్నారు. ప్రధాని న్యాయమూర్తి విశ్రాంతి గదిలో మూడు బాంబులు అమర్చినట్లు తెలిపారు. అంతేకాకుండా కోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైనా పోలీస్ బృందం.. డాగ్ స్వాడ్ తో కోర్టు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. క్లూసు టీంతో కీలక ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు.
“పవిత్ర శుక్రవారం పేలుళ్లకు పాకిస్తాన్ తమిళనాడు కుట్ర పన్నింది. జడ్జి గది/కోర్టు ప్రాంగణంలో 3 బాంబులు అమర్చారు. మధ్యాహ్నం 2 గంటలలోపు ఖాళీ చేయండి.” ఆ లేఖలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని పేర్కొంటూనే కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులు ఉంచినట్లు’ ఈమెయిల్‌లో ఆగంతకులు పేర్కొన్నారు.