- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్-హర్యానా హైకోర్టు కు గురువారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో కోర్టు పరిధిలో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వస్తువును చెక్ చేస్తున్నారు. అనంతరం కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆవరణలో ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలని, చుట్టు పక్కల పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు లేదా బార్ అసోసియేషన్‌లో సమాచారం అందజేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.
- Advertisement -