- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎంఓ, లోక్‌భవన్‌కు (రాజ్‌భవన్) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. వాటిని పేల్చేయడానికి కుట్ర చేస్తున్నారని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉందయం ముఖ్యమంత్రి కార్యాలయం , లోక్‌భవన్‌కు వాసుకీ ఖాన్ పేరుతో ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వీఐపీలు, ప్రముఖులను అందులో నుంచి ఖాళీ చేయించారు. బెదిరింపులు రావడంతో గవర్నర్ సీఎస్‌ఓ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మెయిల్‌పై దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
- Advertisement -



