Saturday, May 24, 2025
Homeతాజా వార్తలువిశాఖ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

విశాఖ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని శనివారం ఓ అగంతకుడు ఫోన్ కాల్ చేసి బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు ప్రారంభించాయి. బాంబు లేదని నిర్ధారణకు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఒక్కసారిగా తనిఖీలు చేపట్టడంతో ప్రయాణికులు ఏమైందోనని ఆందోళన చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -