నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో ఇవాళ సుమారు 50 స్కూళ్లకు మెయిల్ బెదిరింపు వచ్చాయి. టెర్రరైజర్స్ 111 అనే గ్రూపు వివిధ స్కూళ్లకు మెయిల్ చేసినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. డీఏవీ పబ్లిక్ స్కూల్, ఫెయిత్ అకాడమీ, డూన్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయతో పాటు ఇతర స్కూళ్ల బెదిరింపులు వచ్చాయి. 25 వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నారు.
స్కూల్ ఆవరణల్లో 48 గంటల్లోగా బాంబులు పేల్చుతామని మెయిల్‌లో పేర్కొన్నారు. మేం టెర్రరైజర్స్ 111 గ్రూపుకు చెందినవాళ్లమని, మీ బిల్డింగ్‌లో పేలుడు పదార్ధాలు అమర్చామని, క్లాస్‌రూమ్‌లూ.. ఆడిటోరియంలు, స్టాఫ్ రూమ్‌లు, స్కూల్ బస్సులను శక్తివంతమైన సీ4 బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నారు.