Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి బాంబు బెదిరింపులు

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి బాంబు బెదిరింపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖ స్కూళ్లలో, విమానాశ్రయాల్లో బాంబులు అమర్చినట్లుగా తరచూ అధికారులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే వీటిపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి ముంబైలోని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది. బీఎస్‌ఈ భవనంలో బాంబు పెట్టినట్లు అధికారులకు మంగళవారం ఈమెయిల్‌ వచ్చింది. కామ్రేడ్‌ పినరయి విజయన్‌ పేరుతో మెయిల్ వచ్చిందని, అందులో నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, ఎటువంటి అనుమానిత వస్తువులు లభించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad