Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంహీరో విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపులు

హీరో విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబ్ బెదిరింపుల మెయిల్ వచ్చింది. శనివారం రాత్రి విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన నేపథ్యంలో విజయ్ ఇంటికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ రోజు ఉదయం 9:30ని ప్రాంతాలో చెన్నైలోనిలోని విజయ్ నివాసంలో బాంబులు పెట్టినట్లు దుండగులు రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈ–మెయిల్ చేశారు. అలాగే విజయ్ ఇంట్లోని టెలిఫోన్ కి కాల్ చేసి.. మరికొద్ది సేపట్లో ఇంటిని కూల్చేస్తున్నామని బెదిరించారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ తో వెళ్లి ఇంటి లోపల, బయట అణువణువున తనిఖీ చేసింది. అయితే హీరో విజయ్ ఇంట్లో ఎటువంటి బాంబులు, వాటి ఆనవాల్లు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -