Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయం20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు..

20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు లెటర్ వచ్చిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ విహార్, రోహిణీ సెక్టార్-3 ప్రాంతంలోని మొదట రెండు స్కూళ్లకు ఆగంతకుడు ఓ బాంబు బెదిరింపు లెటర్ పంపాడు. దాదాపు 20 స్కూళ్ల తరగతి గదుల్లో పేలుడు పరికరాలను (ట్రైనైట్రోటోలుయిన్) ఉంచినట్లుగా లేఖలో ప్రస్తావించాడు. బాంబులు నల్లని ప్లాస్టిక్ బ్యాగులలో ఎవరి కంట్లో పడకుండా ఉంద‌ని తెలిపాడు. బ్లాస్ట్ అయ్యాక ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని ఆగంతకుడు పశ్చిమ విహార్, రోహిణీ సెక్టార్-3 స్కూళ్లలో లెటర్ వదిలి వెళ్లాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందేజేశారు. వారు బాంబు స్వ్కాడ్‌తో కలిసి స్కూళ్లకు చేరుకుని విద్యార్థులను బయటకు పంపి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానించదగిన వస్తువులు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ 20 స్కూళ్లకు బెదిరింపు లేఖను పంపిందెవరని కనిపెట్టే పనిలో పోలసుల దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -