- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు.. సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈ రెండు పాఠశాలలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -