- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మంటలను వెలిగించి, గ్రామస్థులు చిన్నలు పెద్దలు ఘనంగా సంక్రాంతి సంబరాలను చేసుకున్నారు.ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు రావుల నాగరాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే ఇది పూర్తిగా గ్రామీణ పండుగ అని గ్రామంలో ముగ్గులు పోటీలను ఏర్పాటు చేసుకుని ఆనందోత్సాహాలతో జరుపుకునే సంతోషకరమైన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల కొండల్ రెడ్డి, వళ్ళందస్ పరమేష్,నకిరేకంటి జనార్దన్,పిన్నం ఉప్పలయ్య,రావుల మహిపాల్,విగ్నేష్, ఉపేందర్,రాజశేఖర్ శ్రీను,నర్సింహ,నరేష్, మెడబోయిన రాజు,పాల్గొన్నారు
- Advertisement -



