Sunday, July 13, 2025
E-PAPER
Homeసోపతిపుస్తకాల మార్పిడి ఉద్యమం

పుస్తకాల మార్పిడి ఉద్యమం

- Advertisement -

జ్ఞానాన్ని ఇంకొకరికి పంచుకోవడం లేదా ఇతరులకి అందించడం గొప్ప లక్షణం. తమ దగ్గర ఉన్న దాన్ని నలుగురికి సహాయం చేయడం గొప్ప గుణం. అలాంటి కోవలోదే ఇద్దరు వ్యక్తులు లేదా సమూహాల మధ్య పుస్తకాలను మార్చుకునే ప్రక్రియ. స్థానికంగా ఇరుగుపొరుగుల మధ్య పుస్తకాల మార్పిడి ఒక ప్రముఖ ఉద్యమంగా మారింది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ‘లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ’ (Little Free Library).
ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా చదవడం పట్ల అభిరుచిని పెంచి, చదవడం అనే అలవాటును వ్యాప్తి చేసేటందుకు, సమాజంలో ముఖ్యంగా ఇరుగుపొరుగులలో పుస్తక మార్పిడిని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఈ చిన్న ఉచిత గ్రంథాలయాలు 91 దేశాలలో చదువరులకు సేవలు అందిస్తున్నాయి..
లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ (LFL) : లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ (LFL) అనేది సెయింట్‌ పాల్‌, మిన్నెసోటాలో స్థాపించబడిన ఒక లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. ఒక పుస్తకాన్ని తీసుకోండి, పుస్తకాన్ని ఇవ్వండి (take a book Share a book) వీరి ముఖ్య ఉద్దేశ్యం విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడం, పాఠకులను ఉత్తేజపరచడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద లిటిల్‌ ఫ్రీ లైబ్రరీల గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ద్వారా పుస్తకాలను అందరికీ అందుబాటులోకి వచ్చి జ్ఞానాన్ని అందరికీ పంచడం దీని లక్ష్యం. నమోదైన లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ పుస్తక-షేరింగ్‌ బాక్స్‌ల ద్వారా 400 మిలియన్లకు పైగా పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా షేర్‌ చేసుకున్నారు. అన్ని వయసుల పాఠకులకు పుస్తకాల లభ్యతను గణనీయంగా పెంచి వారికి కావాల్సిన పుస్తక సంపద ను సమకూర్చారు.
లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ యొక్క విజయాలు, భాగస్వామ్యాలు:LFL అమెరిగ్రూప్‌, డిస్నీ, గుడ్‌ మార్నింగ్‌ అమెరికా, గుడ్‌రీడ్స్‌, మెర్సిడెస్‌-బెంజ్‌, సోనీ వంటి ప్రముఖ భాగస్వాములను ఆకర్షించింది. అంతేకాదు,LFL ప్రపంచ పఠన పురస్కారం, గైడ్‌స్టార్‌ యొక్క ప్రతిష్టాత్మకమైన ప్లాటినం పారదర్శకత ముద్రను పొందింది. అలాగే, లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ గ్రంథాలయం, నేషనల్‌ బుక్‌ ఫౌండేషన్‌, మహిళల నేషనల్‌ బుక్‌ అసోసియేషన్‌, అనేక ఇతర సంస్థల నుండి ప్రశంసలు అందుకుంది..
పఠన సంక్షోభం,LFL పాత్ర: ఈ రోజు యునైటెడ్‌ స్టేట్స్‌లో 30 మిలియన్ల మందికి పైగా పెద్దలు మూడవ తరగతి స్థాయి కంటే ఎక్కువగా చదవడం లేదా రాయడం నేర్చుకోలేదు. పిల్లల చేతిలో పుస్తకాలు పఠన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనాలు నిరూపించాయి. ఇంట్లో లేదా ఇంటికి దగ్గరగా ఎక్కువ పుస్తకాలు ఉంటే, పిల్లలు చదవడం నేర్చుకుంటారు, చదవడానికి ఇష్టపడతారు. ఆర్థికంగా వెనుకబడిన 61% మంది ఖూ పిల్లలకు ఇంట్లో పుస్తకాలు లేవు. అలానే భారతదేశ వ్యాప్తంగా 65% యువకులు చదివేందుకు మక్కువ చూపడం లేదు.. ఉన్నా పుస్తక సంపద అందుబాటులో లేదు. ఒకవేళ పుస్తక సంపద అందుబాటులో ఉన్నా చదివేందుకు సరియైన వసతులు వనరులు అందుబాటులో లేవు.
లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ పుస్తక-షేరింగ్‌ బాక్స్‌లు వారంలో 7 రోజులు, రోజులో 24 గంటలు తెరిచి ఉంటాయి. అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. పుస్తకాలు అందుబాటులో లేని ప్రాంతాలలో ఇవి అద్భుతమైన సాధనంగా పనిచేస్తున్నాయి. ఆదివాసీ అమెరికన్‌ ఫస్ట్‌ నేషన్‌ సమాజాలలో, గిరిజన వెనుకబడిన ప్రాంతాలలో సొంత ప్రజా గ్రంథాలయాలు లేకపోవడం వల్ల పుస్తకాల లభ్యత ఒక సవాలుగా మారింది. లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ ఈ ప్రాంతాలకు కూడా పుస్తకాలను అందిస్తూ, పఠన అభివద్ధిని అలవాటును ప్రోత్సహిస్తుంది జ్ఞానవంతమైన సమాజం కోసం లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ సంస్థ పనిచేస్తున్నది.
లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ లక్ష్యం విజన్‌: లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ లక్ష్యం విశ్వవ్యాప్త లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ పుస్తక మార్పిడి బాక్స్‌ల గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ద్వారా నూతన జ్ఞానవంతమైన సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహించడం, పుస్తక పఠనాన్ని ప్రేరేపించడం, ఎవరికైతే పుస్తకాలు అవసరమో వారందరికీ పుస్తకాలు అందుబాటులో ఉంచడం.
వారి విజన్‌ ప్రతి గ్రామము లో ఒక లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ, ప్రతి పాఠకుడికి ఒక పుస్తకం ఉండాలని ఆకాంక్షిస్తుంది. ప్రతి వ్యక్తికి, సమయం, స్థలం వంటి పరిమితులను దాటి, వారికి అవసరమైన పుస్తకాన్ని అందుబాటులో ఉండాలని ూఖీూ నమ్ముతుంది.
లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ కార్యక్రమాలు:
24/7 పుస్తకాలు అందుబాటు: లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ పుస్తక-షేరింగ్‌ బాక్స్‌లు నిరంతరం అందుబాటులో ఉండి, పుస్తకాల లభ్యతకు ఉన్న అడ్డంకులను తొలగిస్తాయి. కొత్త ూఖీూ లను ప్రోత్సహించడం: సమాజాలలో లిటిల్‌ ఫ్రీ లైబ్రరీలను స్థాపించడానికి అవసరమైన సౌకర్యాలు, శిక్షణ మార్గదర్శనాన్నిLFL స్వచ్ఛంద సిబ్బందికి అందిస్తుంది.
అత్యవసర ప్రాంతాలకు ూఖీూ లను అందించడం: తమ కార్యక్రమాల ద్వారా, ూఖీూ అత్యవసరమైన పట్టణ, నగర, గ్రామీణ, ఆదివాసీ, గిరిజన, కొండ ప్రాంతాల యువకులకు పుస్తకాలతో నిండిన లిటిల్‌ ఫ్రీ లైబ్రరీలను ఉచితంగా అందిస్తుంది.
వివిధ రకాల పుస్తకాలను ప్రోత్సహించడం: తమ ‘రీడ్‌ ఇన్‌ కలర్‌’ కార్యక్రమం ద్వారా,LFL BIPOC, LGBTQ, ఇతర విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పుస్తకాలను అందించి వారిని సమాజం పట్ల విలువలు కలిగిన వ్యక్తులుగా మలుచుకునేందుకు ప్రోత్సహిస్తుంది.
సామాజిక భాగస్వాములతో పని చేయడం: పాఠశాలలు, ప్రజా గ్రంథాలయాలు, పౌర సంస్థలు, వ్యాపారాలు ఇతర స్వచ్ఛంద సహాయ సంస్థల సహకారంతో LFL కలిసి పని చేస్తుంది, వారి సమాజాల్లో లిటిల్‌ ఫ్రీ లైబ్రరీలను ప్రవేశపెట్టడానికి సహకరిస్తుంది.
LFL విలువలు
పుస్తకాల అందుబాటు: ప్రపంచవ్యాప్తంగా వివిధ వయసుల పాఠకులకు పుస్తకాలను అందుబాటులో ఉంచడం విస్తతంగా అందించడం, పాటక సమాజాలను బలోపేతం చేయడం, పట్టణ అభిరుచిని ప్రోత్సహించడం, పఠన ఫలితాలను ప్రభావితం చేయడానికి LFL కషి చేస్తుంది.
సహకారం:LFL స్వచ్ఛంద సిబ్బంది, అలాగే స్థానిక, జాతీయ భాగస్వాములతో కలిసి పని చేయడానికి అంగీకరిస్తుంది, విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడానికి, పుస్తక సంపద అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం మెరుగుపరచడానికి. సమానత్వం: ూఖీూ తమ కార్యక్రమాలు, పుస్తకాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి కుల, మత, ప్రాంత విభేదం లేకుండా సమానంగా అందించడం.
గౌరవం:LFL అన్ని వ్యక్తులను, సమాజాలను గౌరవిస్తుంది, వారి సంస్కతి, స్థానికతకు అనుగుణంగా, లిటిల్‌ ఫ్రీ లైబ్రరీలను విలువైన, వ్యక్తిగత పద్ధతిలో ఉపయోగించే జ్ఞానాన్ని గౌరవిస్తుంది. ఆయా ప్రాంతాలకు కావలసిన పుస్తకాలను వయస్సులవారిగా, పుస్తకాల వారిగా అందిస్తూ వారి సంప్రదాయాలను గౌరవిస్తుంది.
పారదర్శకత: లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ లాభాపేక్ష స్వచ్ఛంద సంస్థ తన శక్తి మేరకు పాఠకులకు పుస్తకాలు అందించడం, జ్ఞానవంతమైన సమాజాన్ని తయారు చేయడం, ఎక్కడైతే పుస్తకాలు చదవాలి అని కోరుకునేవారు ఉన్నారో సహాయం అందించడం.
లిటిల్‌ ఫ్రీ లైబ్రరీని స్థాపించడం: ఎవరైనా, ఎక్కడైనా లిటిల్‌ ఫ్రీ లైబ్రరీని స్థాపించవచ్చు. తమ ఇంటిలోని ఖాళీ స్థలంలో, పార్కుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి వివిధ కూడళ్లలో వీటిని స్థాపిస్తున్నారు. ఈ పుస్తక మార్పిడి బాక్స్‌ల ద్వారా వ్యక్తులు, కుటుంబాలు పుస్తకాలను మార్పిడి చేసుకుంటున్నారు. దీనివల్ల సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. అక్షరాస్యతాభివద్ధి మాత్రమే కాదు, కమ్యూనిటీ కలయికలు, సమావేశాలు, వేడుకలు, కథలు చెప్పడం, కళలు, చేతి పనులు వంటి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీనివల్ల సమాజంలో వ్యక్తుల మధ్య ,కుటుంబాల మధ్య, ప్రాంతాల మధ్య బలమైన నైతిక సంబంధాలు ఏర్పడి బలమైన జ్ఞానవంతమైన సమాజానికి పునాది ఏర్పడుతుంది.
ప్రస్తుతం పిల్లలు పుస్తకాల కంటే ఎలక్ట్రానిక్‌ పరికరాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారూ పుస్తకాల పై శ్రద్ధ పెట్టే సామర్థ్యం తగ్గిపోతుంది.
బుక్‌ క్రాసింగ్‌ (BookCrossing): ఆన్‌లైన్‌లో కూడా పుస్తక మార్పిడి చురుకుగా సాగుతోంది. దీనిని ”బుక్‌ క్రాసింగ్‌” అంటారు. ఈ పద్ధతిలో, పుస్తకం ఎక్కడ ఉందో ట్రాక్‌ చేయవచ్చు. సభ్యులు పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా లేదా నియంత్రిత వ్యక్తులకు అందిస్తారు. పుస్తకాలతో పాటు, పాఠకులు తమ రాసిన వ్యాసాలను కూడా చేర్చవచ్చు. ఈ కార్యక్రమంలో 19 లక్షల పుస్తక ప్రేమికులు భాగస్వామ్యులు అయ్యారు అంటే ప్రపంచవ్యాప్తంగా 19 లక్షల మంది పుస్తకాలను చదువుతున్నారు ఈ బుక్‌ క్రాసింగ్‌ పద్ధతి ద్వారా.
గ్రంథాలయాలకు అనుబంధంగా పుస్తక మార్పిడి: పుస్తక మార్పిడి, గ్రంథాలయాలకు ప్రత్యామ్నాయం కాదు. ఇది గ్రంథాలయాలకు ఒక విలువైన అనుబంధం. ఒకసారి చదవడానికి అలవాటు పడితే, ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. అది గ్రంథాలయాలకు దారితీస్తుంది. ఉచితంగా చదవడానికి గ్రంథాలయాలు అద్భుత సాధనాలు. ఒక పుస్తకం చదివే అలవాటు నుండి పుస్తకాలు చదివే అలవాటు కు మారి తద్వారా గ్రంథాలయాలకు అడుగులు వేసే దిశగా ఈ లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ పని చేస్తుంది. మన పయనం పుస్తక మార్పిడితో ప్రారంభమై, అది గ్రంథాలయాలకు చేరువ కావాలని ప్రయత్నం.
లిటిల్‌ ఫ్రీ లైబ్రరీని ఎలా ప్రారంభించాలి: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు లక్షలకు పైగా లిటిల్‌ ఫ్రీ లైబ్రరీలు 128 దేశాలలో బలంగా పనిచేస్తున్నాయి.! మనం కూడా ఒక చిన్న లైబ్రరీని ప్రారంభించాలనుకుంటే, స్థలం ఉన్నట్లయితే లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ వెబ్‌సైట్స్‌ పరిశీలించినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్‌, నెల్లూరు ప్రాంతాలలో సేవలందిస్తున్నాయి. అదేవిధంగా లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ ఎలా ప్రారంభించాలి, సిబ్బందిని ఎలా సమకూర్చుకోవాలి, సౌకర్యాలు ఏ విధంగా సమకూర్చుకోవాలి, పుస్తక సంపదని ఏ విధంగా సమకూర్చుకోవాలి, స్వచ్ఛంద సహాయ సంస్థలతో ఏ విధంగా కలిసి పని చేయాలి అనేటువంటి విషయాలు కూడా ఈ వెబ్‌సైట్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏది ఏమైనా విజ్ఞానవంతమైన సమాజం కోసం లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ సేవలను విస్తత పరిచే ప్రయత్నం చేస్తుంది. అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల పాఠకులకు పుస్తక సంపదను అందించే ప్రయత్నం చేస్తూ దానికి కావలసిన ప్రణాళికను రూపొందిస్తూ నూతన సమాజ నిర్మాణం కోసం బలంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.. లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ చేస్తున్న సేవలను కొనియాడాల్సిందే.

– డా|| రవికుమార్‌ చేగొని,
9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -