Monday, December 29, 2025
E-PAPER
Homeజిల్లాలునేటితో ముగియ‌నున్న బుక్‌ఫెయిర్‌

నేటితో ముగియ‌నున్న బుక్‌ఫెయిర్‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లోని ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణంలో కొనసాగుతున్న 38వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు విద్యార్థులు, యువత పోటెత్తుతున్నారు. సోమవారంతో బుక్‌ఫెయిర్‌ ముగియనుండటంతో ఆదివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో సాగిన బుక్‌ఫెయిర్‌కు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడం కనిపించింది. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌లకే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో యువత పుస్తకాలపై ఆసక్తిని కనబర్చడం ఆనందాన్ని కలిగిస్తుందని పలువురు కవులు, రచయితలు పేర్కొంటున్నారు. ఇప్పటికే బుక్‌ఫెయిర్‌ను 12 లక్షలకు పైగా పుస్తకాభిమానులు సందర్శించారని ఇందులో అధికంగా యువత, విద్యార్థులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తుందని బుక్‌ఫెయిర్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -