Tuesday, December 9, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంస‌రిహ‌ద్దు గొడ‌వ‌లు..యూఎన్ఒ ఛీప్ ఆందోళ‌న‌

స‌రిహ‌ద్దు గొడ‌వ‌లు..యూఎన్ఒ ఛీప్ ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: థాయిలాండ్, కంబోడియాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు సంయమనం పాటించాలని, కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

కాగా, గత రెండు రోజుల్లో థారు సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు కంబోడియా పౌరులు మృతి చెందారు. 20 మందికిగా పైగా గాయాలపాలయ్యారు అని కంబోడియా వార్తాపత్రిక ఖైమర్‌ టైమ్స్‌ నివేదించింది. ఈ ఘర్షణల్లో ఒక థాయిలాండ్ సైనికుడు మృతి చెందాడు. పద్దెనిమిది మంది గాయపడ్డారు అని బ్యాంకాక్‌ పోస్ట్‌ నివేదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -