Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ పేలి బాలుడి మృతి.. మ‌రో 12 మంది

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ పేలి బాలుడి మృతి.. మ‌రో 12 మంది

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని చిన్న‌య్య‌న‌పాళ్యా ఏరియాలో శుక్ర‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో ఒక బాలుడు మృతి చెంద‌గా, మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. అయితే ఈ పేలుడు ధాటికి ఇంటి పైక‌ప్పు పూర్తిగా కుప్ప‌కూలింది. గోడ‌లు ధ్వంస‌మ‌య్యాయి. గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌క‌పోవ‌చ్చు అని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద తీవ్ర‌త‌ను చూస్తుంటే.. ఇత‌ర పేలుడు ప‌దార్థాలు పేలుడుకు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని స్థానికులు పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad