– బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి
నవతెలంగాణ-పాలకుర్తి : బీసీల చైతన్యానికి బీపీ మండల్ స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ అనుబంధ బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిలువేరు కృష్ణమూర్తి అన్నారు. బీపీ మండల్ 107వ జయంతి వేడుకలను పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలో గల బస్టాండ్ సమీపంలో నల్ల నరసింహులు చౌక్ వద్ద బీపీ మండల్ చిత్రపటానికి బీసీ జిల్లా నాయకులు తోటకూరి పాండు కృష్ణ, వి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొలుగూరి యాకయ్య గౌడ్ తో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీల ఐక్యతకు బీపీ మండల్ చేసిన చేశాడని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలు ఎదగాలన్నదే బిపి మండల్ లక్ష్యమన్నారు. బీపీ మండల్ స్ఫూర్తితో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఓబిసి బీసీల చైతన్య పరుస్తూ, సంఘసంస్కర్తగా సేవలు చేస్తూ, స్వతంత్ర సమరయోధుడిగా ఓబీసీ బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడని అన్నారు. 27% బీసీల రిజర్వేషన్ల అమలుకు ఆజ్యం పోసిన మహా గొప్ప నాయకుడు బీపీ మండల్ అని కొనియాడారు. భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి బీపీ మండల్ రిజర్వేషన్లలో స్థానిక సంస్థలలో కులదొరల గడీల పరిపాలనను కూల్చి బడుగుల జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడు బీపీ మండల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వర్రె వెంకన్న యాదవ్, బైకాని ఐలేష్ యాదవ్, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, పులి గణేష్, కమ్మగాని నాగయ్య గౌడ్, ఎండి సలీం. లింగయ్య యాదవ్, గుమ్మడిరాజుల సాంబయ్య, కత్తుల బిక్షపతి యాదవ్, సలేంద్ర సంపత్ యాదవ్, పన్నీరు వెంకన్న, , బెల్లీ యుగంధర్ యాదవ్, చిదురాల రాజశేఖర్ , శ్రీకాంత్, రమాకర్, తదితరులు పాల్గొన్నారు.
బీసీల చైతన్యానికి బిపి మండల్ స్ఫూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES