Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం 

బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం 

- Advertisement -

– ఆ గ్రామ ప్రత్యేక అధికారి నరేష్
– మమ్ములను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు
– ఘనంగా విజయోత్సవ ర్యాలీ 
– బ్రాహ్మణకొత్తపళ్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ 
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచిగా మరియు ఉప సర్పంచ్ గా వార్డు సభ్యులను సోమవారం ప్రమాణస్వీకారం చేయించినట్లు ఆ గ్రామ ప్రత్యేక అధికారి నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ గ్రామ నూతన సర్పంచిగా చిర్ర యాకాంతం గౌడ్ ను ఉప సర్పంచ్ గా పిట్టల ఉపేందర్ ను మరి వార్డు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించామని అన్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం మాట్లాడుతూ సర్పంచిగా మరియు వార్డు సభ్యులను గెలిపించిన ప్రజలకు  ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. అనంతరం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రజల కావలసిన అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు నడుస్తామని అన్నారు. గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని పరిష్కరిస్తామని అన్నారు. మాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -