నవతెలంగాణ – హైదరాబాద్: బ్రెజిల్ లో టోర్నడో బీభత్సం సృష్టించింది. దక్షిణ బ్రెజిల్‌లోని రియో బోనిటో డో ఇగువా పట్టణాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసేసింది. ఈ టోర్నడో బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన భయంకరమైన గాలులకు పట్టణం చాలావరకూ తుడిచిపెట్టుకుపోయింది. 90 శాతం పట్టణం నాశనమైంది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు గాల్లో ఎగిరి పడ్డాయి. గాలుల తీవ్రతకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ టోర్నడో బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 800 మంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
బ్రెజిల్ లోటోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



