Magazines

చేవెళ్లలో చెట్టును ఢీకొట్టిన ఆర్మీ వాహనం

4 గంటల క్రితం

A military vehicle hit a tree in Chevella.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి ఆర్మీ శిక్షణలో భాగంగా షాబాద్ వైపు బయలుదేరిన జవాన్ల వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. కారును తప్పించబోయి అదుపుతప్పిన ఆర్మీ వాహనం రోడ్డుపై పలుమార్లు పల్టీలు కొడుతూ చివరకు పక్కనే ఉన్న భారీ చెట్టును బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 14 మంది ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడగా, వారిలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ధాటికి వాహనం నుజ్జునుజ్జు అయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్