దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కు తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.
సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవు తుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ మీడియాతో ముచ్చటించారు.
ఈ ఏడాది వరుసగా విజయాలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. అలాగే ‘ఇరు ముడి’ జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది.
ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో వస్తున్నాం. ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. ఇదొక బ్యూటిఫుల్ ఇన్‌స్పిరేషనల్ ఫిల్మ్.
‘లక్కీ భాస్కర్’ తర్వాత దుల్కర్ ఈ సినిమా చేయడం చాలా ఆనం దంగా ఉంది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. కచ్చితంగా ఈ సినిమాకు చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నమ్ముతున్నాను. కమర్షి యల్‌గానూ అద్భుతమైన విజ యాన్ని అందుకుంటుంది.
ఇది తెలుగు సినిమాలో ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇది ఎమోషనల్ ఫిల్మ్. అలాగే చాలా మోటివేష నల్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఒక స్పెషల్ మ్యూజికల్ టచ్ కావాలని ప్రత్యేకంగా మ్యూజిక్ చేశాం. ఈ సినిమా మ్యూజిక్ చాలా ఐకానిక్‌గా ఉండబోతోంది.
హాలీవుడ్‌లో చాలా ఇన్‌స్పిరేషనల్ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ పరంగా ఎలాంటి భావోద్వేగం కలుగుతుందో, మన ఇండియన్ మ్యూజిక్‌లోనే అలాంటి ఫీల్ తీసుకొచ్చేలా ఈ సినిమా కోసం మ్యూజిక్ చేశాను.
ఇందులో కొన్ని స్పెషల్ సింథసైజర్స్‌ను ఉపయోగిం చాం. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సౌండ్‌ను క్రియేట్ చేశాం. దీనికి ఒక స్పెషల్ సౌండ్ జోన్ ఉంది. అది ఈ కథకు, సినిమాకు చాలా యూనిక్‌గా ఉండబోతోంది.
ఈ సినిమాలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . ఇందులో శ్రుతి హాసన్‌తో ఒక పాట పాడించాం. అది త్వరలోనే రిలీజ్ కాబోతోంది. తను అద్భుతంగా పాడారు.
ఈ సినిమా రికార్డింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా మ్యూజిక్ చాలా క్వాలిటీతో ఉంటుంది. ‘ఆకాశంలో ఒక తార’ ఒక మోడరన్ క్లాసిక్ సినిమా.
ప్రతి ఫ్యామిలీ తప్పకుండా చూడాల్సిన సినిమా
13 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 13, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)