Magazines

‘దాదా’ మాస్‌ ధమాకా..

18 నిమిషాల క్రితం

Dada
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

బాలకృష్ణ నటిస్తున్న నయా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గతంలో ‘వీరసింహారెడ్డి’తో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ ‘దాదా ధమాకా’తో మ్యూజికల్ హీట్ పెంచారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కలిసి కనిపించిన ఈ పాట ఫుల్ ఎనర్జీతో సాగుతూ ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో మంచి మ్యూజికల్ జర్నీని కొనసాగిస్తున్న తమన్ ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇన్ఫెక్షియస్ బీట్స్, క్యాచీ రిథమ్స్‌తో పాటను ఫుల్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌గా రూపొందించారు.

పాటలోని పార్టీ మూడ్‌కు తమన్ సంగీతం అద్భుతంగా కుదిరింది. నర్గీస్ ఫక్రీ గ్లామర్, బాలకృష్ణ తనదైన ఎనర్జీతో డ్యాన్స్ ఫ్లోర్‌పై సందడి చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పాటకు సరదా టచ్‌ను తీసుకొచ్చాయి. బాలకృష్ణ మౌనంగా ఉండటంపై నర్గీస్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పాట పాడుతూ డ్యాన్స్‌లో పాల్గొనాలని ఆయన్ని ప్రోత్సహించేలా సాహిత్యం సాగుతుంది. రజిని శ్రీ పూర్ణిమ తన వాయిస్‌తో పాటను మరింత ఆకట్టుకునేలా చేశారు. బాలకృష్ణ కూడా ఈ పాటలో కొంత భాగాన్ని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత. పాట విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. శేఖర్ వీజే మాస్టర్ ఈ పాటకు స్టైలిష్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా కొరి యోగ్రఫీ అందించారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ‘దాదా ధమాకా’ ఫుల్ ఎనర్జీతో సాగుతూ మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్ సాంగ్‌గా నిలిచేలా ఉంది. ఈ సినిమాలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్