Magazines

ఈ కాయతో ఎన్ని ప్రయోజనాలో..

17 నిమిషాల క్రితం

fruit/pod
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

బూడిద గుమ్మడి కాయ(Ash Gourd)ను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కాని, దీన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ బూడిద గుమ్మడి కాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని చల్లబరిచేందుకు ఉపయోగపడుతుంది. మార్కెట్లో దొరికే ఫ్రూట్స్(పండ్ల)తో పోలిస్తే ..అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్ల(Vitamis)ను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్-C, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-B2, మెగ్నీషియం, జింక్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటు ఫైబర్, నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. మానవ శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని రెగ్యులర్‌గా మన ఆహారంలో చేర్చుకోవడంవల్ల రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా కంటి చూపు మెరుగుపడుతుంది.

దీనిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల టైపు 2 డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో కాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల గుమ్మడికాయను తీసుకుంటే కేవలం 13 క్యాలరీల మాత్రమే వస్తాయి. అంతేకాక కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికీ బూడిద గుమ్మడి ఒక వరం వంటిది. గుమ్మడి కాయను రోజు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా అల్జిమర్‌ బారిన పడకుండా చేస్తుంది. దీన్ని సలాడ్లు, జ్యూస్‌లు, కూరలు, సూప్‌లు, స్మూతీలుగా అనేక రకాలుగా ఆహారంలోకి తీసుకోవచ్చు. బూడిద గుమ్మడి తో హల్వా, తీపి గుమ్మడి కూర, వడియాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పేట స్వీట్ ఇలా వివిధ రకాల ఆహారపదార్థాలు చేసుకొని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్