హీరో నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై నితిన్ హీరోగా ‘అలియాస్ రుక్మిణి’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దీప్తి గంట నిర్మిస్తు న్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రుక్మిణి’కి మంచి రెస్పాన్స్ రావడంతో, తాజాగా రెండో పాట ‘పిచ్చి ప్రేమలో’ను మేకర్స్ విడుదల చేశారు.
విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఈ పాట మంచి మెలోడీగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్, వినసొంపైన స్ట్రింగ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్తీక్ తన వాయిస్‌తో పాటను మరింత బాగుండేలా చేశారు. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ హీరో తన భార్యపై చూపించే ప్రేమను చాలా అందంగా తెలియజేస్తున్నాయి. తన భార్య అందంగా ఉండటమే కాకుండా, అల్లరి చేసే స్వభావం, అప్పుడప్పుడు మారాం చేయడం, చిన్న చిన్న విషయాలకు అలగడం తనకు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుందని హీరో ఈ పాటలో చెబుతాడు.
ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన అతను ప్రతిరోజూ కొత్తగా ఆమె ప్రేమలో పడుతుంటాడు. తన ప్రేమను ఎంతగా వ్యక్తం చేసినా, తన మనసులో ఉన్న భావాలను, ఆమె తన జీవితంలో తీసుకొచ్చిన ఆనందాన్ని మాటల్లో పూర్తిగా చెప్పలేనని భావిస్తాడు. ఈ పాటకు ఈశ్వర్ పెంటి అందించిన కొరియోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది. ఈ పాట కొత్తగా పెళ్లైన జంట మధ్య ఉండే ప్రేమను, అను బంధాన్ని చాలా సహజంగా చూపిస్తుంది.
ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. నితిన్, ఆఫియా సయ్యద్, సాయి కుమార్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్, నిర్మాత: దీప్తి గంటా, సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్, సంగీతం: విజయ్ బుల్గానిన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ.
భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా..
12 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)