Magazines

కొత్త వైమానికదళ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

1 గంట క్రితం

new Air Force Chief
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కొత్త చీఫ్‌గా శనివారం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎ.పి. సింగ్‌ స్థానంలో ఆయన నియమితులయ్యారు. గతంలో వైమానిక దళ వైస్‌ చీఫ్‌గా, చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీకి అనుసంధానమైన ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు.


సుమారు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న దీక్షిత్‌ ఫైటర్‌, టెస్ట్‌ పైలట్‌గా వివిధ విమానాల్లో 3,500 గంటలకు పైగా ప్రయాణించారు. ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌, ఆపరేషన్‌ రక్షక్‌, కోప్‌ ఇండియా, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి సైనిక కార్యకలాపాలు, విన్యాసాల్లో పాల్గొన్నారు. పలు కీలక కమాండ్‌, సిబ్బంది బాధ్యతలు నిర్వహించిన ఆయనకు వైమానిక దళ కార్యకలాపాలు, ప్రణాళికలు, ఆధునికీకరణ రంగాల్లో విశేష అనుభవం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్