Magazines

పట్టణ 'పీహెచ్‌సీ'ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా 

55 నిమిషాల క్రితం

inspects
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి

​సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శనివారం  పట్టణ పరిధిలో ఉన్న  ఎన్టీఆర్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ)  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఈ సందర్శనలో భాగంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలను ఆమె పరిశీలించారు.


​ఆసుపత్రి రికార్డులను, ఔషధాల నిల్వలను పరిశీలించి, వైద్య సిబ్బంది అందుబాటు వివరాలపై ఆరా తీశారు. ​దవాఖానకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్య సిబ్బందికి ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ​ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, పట్టణ కాంగ్రెస్  అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, కౌన్సిలర్లు మొహమ్మద్ నసీమా షరీఫ్, ఉప్పు నాగమణి, బండారు శరత్ చంద్ర, జగన్నాథం శ్రీను పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్