నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న వివాదాలు సమసిపోయే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే ఐపీఎల్ మినీ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొనేందుకు బీసీసీఐ అనుమతించింది. డిసెంబర్ 16న జరగనున్న వేలంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అధికారిక సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఈ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, నహీద్ రాణా, రిషద్ హొస్సేన్, హసన్ మహమూద్, తౌహిద్ హృదయ్, తస్కిన్ అహ్మద్ తదితర ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
గతంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి విడుదల చేయించడం ఇరు దేశాల క్రికెట్ వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అయితే ఐసీసీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. తాజాగా ఐపీఎల్ వేలానికి బంగ్లా ఆటగాళ్లకు అవకాశం కల్పించడంతో ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.






కామెంట్‌లు (0)