నవతెలంగాణ - హైదరాబాద్: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 12 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ తనదైన స్టైల్, యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించారు. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రావడం విశేషం. థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు ఇప్పుడు ఇంటి నుంచే సినిమాను వీక్షించవచ్చు.
ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’
27 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)