నవతెలంగాణ-హైదరాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల హత్యకు సంబంధించిన కేసులో ఇద్దరు దోషులకు విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంపై బాధితురాలు బిల్కిస్ బానో స్పందించింది. ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపోయింది. ఈ విషయం నాకు పత్రికా నివేదికల ద్వారానే తెలిసిందన్నారు.మంగళవారం ఆమె న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ శోభా గుప్తా ద్వారా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
"నన్ను పిలవకుండా, నా వాదన వినకుండానే సుప్రీంకోర్టు రెండోసారి ఉత్తర్వు జారీ చేయడం... నమ్మలేకపోతున్నాను, బాధ, దిగ్భ్రాంతి అవిశ్వాసంతో కూడిన తాజా కన్నీళ్లు" వచ్చాయి. "నన్ను పిలవకుండా, నా వాదన వినకుండానే సుప్రీంకోర్టు రెండోసారి ఉత్తర్వు జారీ చేయడం... నమ్మలేకపోతున్నాను" అని ఆమె లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
"నేను ఎంతో కష్టపడి సాధించుకున్న న్యాయాన్నే ఇప్పుడు కోల్పోతున్నాననిపిస్తోంది. పాత భయాలు మళ్లీ తలెత్తుతున్నాయి. నా గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి నేను మళ్లీ భయపడుతున్నాను. అంతేకాదు, న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరోసారి కోల్పోతాననే భయం కూడా నన్ను వెంటాడుతోంది" అని బానో అన్నారు.
కేసు వివరాలు :
2002, ఫిబ్రవరి లో గుజరాత్ అల్లర్ల సమయంలో 21 ఏళ్ల వయస్సు, ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. జోషీ, మోర్ధియాలను ట్రయల్ కోర్టు దోషులుగా నిర్థారించి, జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది. జనవరి 8, 2024న, సుప్రీంకోర్టు ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు కల్పించిన శిక్షా తగ్గింపును రద్దు చేసింది.
గుజరాత్ ప్రభుత్వం నిందితులకు "సహకరించడం" ద్వారా తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసిందని తీవ్రంగా విమర్శించింది. ఈ కేసులో మోర్ధియా, జోషీలతో పాటు గోవింద్ నాయి, రమేష్ చందనా, మితేష్ భట్, బకాభాయ్ వోహానియా, కేసర్ భాయ్ వోహానియా, జశ్వంత్ నాయి, రాధేశ్యామ్ షా, రాజుభాయ్ సోనీ, శైలేష్ భట్లు దోషులుగా ఉన్నారు. దోషుల శిక్షను తగ్గించినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు, శిక్షా తగ్గింపును మంజూరు చేసే అధికారాన్ని ఆ ప్రభుత్వం "అక్రమంగా తన చేతుల్లోకి తీసుకుందని" పేర్కొంది. బిల్కిస్ బానో కేసును గుజరాత్ కోర్టు నుండి ముంబైలోని కోర్టుకు బదిలీ చేసినందున, శిక్షా తగ్గింపును మంజూరు చేసే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.







కామెంట్లు (0)