Magazines

బీజేపీ-శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీలు పొత్తు

39 నిమిషాల క్రితం

Akali Dal alliance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెల‌ల‌ ముందు పంజాబ్ (Punjab) రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప‌రిణామం చోటుచేసుకుంటోంది. బీజేపీ (BJP), శిరోమ‌ణి అకాలీద‌ళ్ (SAD) పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ మేర‌కు ఇవాళ‌ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం (BJP Head quarters) లో ఇరుపార్టీలు తమ పొత్తు విష‌యాన్ని అధికారికంగా ప్రకటించాయి.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పొత్తును ప్ర‌క‌టించారు. ఆరేళ్ల క్రితం విడిపోయిన ఈ పాత మిత్రపక్ష పార్టీలు మ‌ళ్లీ చేతులు క‌లిపాయి. అంతకుముందు దాదాపు 24 ఏళ్లపాటు కలిసి ప్రయాణించిన ఈ రెండు పార్టీలు.. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ‌ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు ఉధృతమ‌వ‌డంతో 2020 సెప్టెంబర్‌లో విడిపోయాయి. అప్పుడు అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగా.. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ఇటీవల సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రధాని మోదీతో భేటీ అయ్యి పొత్తు విష‌యం మాట్లాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్