Magazines

ఆగి ఉన్న కోళ్ల వ్యాన్‌ను ఢీకొట్టిన కారు..దంపతుల దుర్మరణం

52 నిమిషాల క్రితం

poultry van accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అల్గోల్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న కోళ్ల వ్యాన్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతులను మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు,సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్