Magazines

దసరా పండుగ వేళ మద్యం కిక్కు..తెలంగాణలో రూ.755 కోట్ల అమ్మకాలు

1 గంట క్రితం

wines
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దసరా పండుగ తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈసారి మద్యం అమ్మకాలు గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాయి. పండుగకు ముందు కేవలం నాలుగు పనిదినాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడై, సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.698 కోట్ల విక్రయాలను ఈసారి అమ్మకాలు అధిగమించాయి.

పండుగ సీజన్‌లో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే అయినా, ఈసారి విక్రయాలు అంచనాలను మించిపోయాయి. ముఖ్యంగా పండుగకు ముందురోజైన అక్టోబర్ 19న ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోవడం గమనార్హం. దసరా ముందు విక్రయాలను పరిశీలిస్తే, అక్టోబర్ 14న రూ.102.17 కోట్లు, 16న రూ.126.32 కోట్లు, 17న రూ.223.25 కోట్ల మద్యం అమ్ముడైంది. 15, 18 తేదీల్లో డిపోలకు సెలవు కావడంతో ఆ రెండు రోజులు మినహాయించి ఈ గణాంకాలు నమోదయ్యాయి.

విక్రయాల సరళిని చూస్తే ఎప్పటిలాగే బీర్ల హవా కొనసాగింది. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 10.44 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, 6.83 లక్షల కేసుల హార్డ్ లిక్కర్ విక్రయాలు జరిగాయి. ఈ అమ్మకాలతో అక్టోబర్ 19 నాటికే ఈ నెలలో మొత్తం మద్యం విక్రయాల విలువ రూ.2,055 కోట్లకు చేరుకుంది. దసరా సీజన్ కావడంతో నెల చివరి నాటికి విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలోని 17 డిపోల ద్వారా 2,620 వైన్‌షాపులు, 1,113 బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు ఇతర క్లబ్బులు, పబ్బులకు మద్యం సరఫరా అవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్